బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. బుల్లితెర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బిగ్‌బాస్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకంటే ఎక్కువగా తన బోల్డ్ ఔట్ ఫిట్స్‌తో జనాకర్షణ పొందుతుంది. విభిన్న రకాల దుస్తులను ధరిస్తూ అందాలతో కుర్రకారను ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉర్పీ.. తన చిన్నతనం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా టీనేజ్ వయసులో తన ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. 17 వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ఎన్నో కష్టాలు అనుభవించానని తెలిపింది.
"నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఎవరో నా ఫొటను పోర్న్ సైట్‌లో అప్ లోడ్ చేశారు. ఫేస్‌బుక్‌లో నా ప్రొఫైల్ ఫొటోను డౌన్ లోడ్ చేసి దాన్ని ఎలాంటి మార్ఫింగ్ చేయకుండా యాథావిధిగా పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. నిదానంగా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసింది. కానీ అందరూ తప్పు నాదే అన్నట్లుగా నన్ను బాధ్యురాలిని చేశారు. నేను పోర్న్ స్టార్‌ను అంటూ నిందలేశారు. ఒకవేళ అయి ఉంటే వీడియో ఎక్కడ? అని ప్రశ్నించగా.. ఒక్కరు కూడా నమ్మలేదు" అంటూ ఉర్ఫీ తన చేదు అనుభవాన్ని గురించి వివరించింది.
చివరకు తన తండ్రి కూడా తనను పోర్న్ స్టార్ అంటే నమ్మాడని, ఆ ఘటన ద్వారా జాలి పొందాలని(Sympathy Gain) అనుకున్నాడని స్పష్టం చేసింది. "నేను పోర్న్ స్టార్ అంటే మా నాన్న కూడా నమ్మేశాడు. ఆ ఘటన నుంచి జాలి పొందాలని చూశాడు. ఫొటోను తొలగించాలంటే పోర్న్ సైట్ వాళ్లు రూ.50 లక్షలు అడుగుతున్నారని అందరికీ చెప్పేవాడు. మా బంధువులకు, స్నేహితులకు అందరితోనూ ఈ విషయం గురించి మాట్లాడేవాడు. అసలు అది సాధ్యం కాదని నేను గట్టిగా చెప్పలేకపోయాను. ఇక్కడ బాధితురాలిని నేనే అంటే ఇంట్లో అందరూ కలిసి నన్ను కొట్టేవాళు. రెండేళ్ల పాటు ఆ బాధలను భరించాను. ఆ కష్టాలను తట్టుకోలేక 17 వయసులో ఇంటి నుంచి పారిపోయాను" అని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేసింది.