దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుతోంది నయనతార. ఏజ్ పెరుగుతున్నా కొద్ది...క్రేజ్ కూడా పెంచరకుంటూ వెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్.. లేడి సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాధించుకుంది. సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్ గా చెలామణి అవుతున్ననయన్ సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమా అంటే దర్శక నిర్మాతలకు ఫస్ట్ ఆప్షన్ నయన్‌తారనే. అయితే గతకొంత కాలంగా నయన్‌ను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వెంబటిస్తున్నాయి.
ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నయన్.. ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేస్తోంది. ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడున్నాయి. కాని నయనతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వరుసగాఆఫర్లు ఆమె తలుపుతడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉంది నయనతార. అందులో బాలీవుడ్ సినిమా ఒకటి కాగా.. కోలీవుడ్ లో నీలేష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది.