టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన సతీమణి స్నేహ రెడ్డి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన పిల్లలకు అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే మామూలు విషయం కాదు హీరోయిన్లకు కూడా ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్నదని చెప్పాలి.ఇక స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లో చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు.అయితే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కారణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఒకప్పుడు చీరలో ఫోటోషూట్ లో చేసే ఈమె ప్రస్తుతం తన వస్త్రధారణ పూర్తిగా మార్చారని తెలుస్తోంది.పొట్టి పొట్టి దోస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తున్నారు. అయితే తాజాగా బన్నీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈమె ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి సందడి చేశారు. అయితే ఈ డ్రెస్సులు ఈమె థైస్ అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాంటీ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేయడంతో బన్నీ అభిమానులు ఈ విషయంపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై స్పందించిన బన్నీ యాంటీ ఫ్యాన్స్ రోజురోజుకు స్నేహారెడ్డి తన బట్టల సైజు తగ్గిస్తున్నారని ట్రోల్ చేయడంతో బన్నీ అభిమానులు ఈ విషయంపై ఈమెకు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించిన వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.