కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'రుద్రుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 14న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
యాక్షన్‌తో కూడిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్‌లో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
లారెన్స్ సరసన జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్, శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.