బ్రిటిష్ నటి మిల్లీ బాబీ బ్రౌన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ప్రముఖ అమెరికన్ సింగర్, గేయ రచయిత జోన్ బాన్ జోవి కుమారుడు నటుడు జాకబ్ బొంగియోవితో ఆమె వివాహం జరగనుంది. ఇటీవలే వారి నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో దిగిన ఫొటోను ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా ఆమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. 'స్ట్రేంజర్ థింగ్స్' సినిమాతో ఆమె పాపులర్ అయ్యారు.