దొంగలున్నారు జాగ్రత్త పరాజయం తర్వాత యువ కథానాయకుడు సింహా కోడూరి 'ఉస్తాద్' అనే ఏవియేషన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఫణిదీప్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ సింహ కోడూరికి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉస్తాద్ టీజర్‌ను టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. టీజర్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం మరియు హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాని నిర్మించారు. ఏకేవా బి ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.