సాలా ఖదూస్ (గురు), గేమ్ ఓవర్, విక్రమ్ వేద వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన YNOT స్టూడియోస్ తన 23వ చిత్రాన్ని ప్రకటించింది. మూవీ మేకర్స్ ఈ చిత్రానికి 'టెస్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్టార్ నటులు ఆర్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందని మూవీ మేకర్స్ వెల్లడించారు.
YNOT స్టూడియోస్ నిర్మాత S శశికాంత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చక్రవర్తి రామచంద్ర మరియు ఎస్ శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో సహా 5 ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ధృవీకరించారు.