ప్రముఖ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితం మైయోసైటిస్ వ్యాధితో బాధపడింది. ఆమె నటించిన 'శకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సమంత అస్వస్థతకు గురైంది. ఆమె జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇవాళ ఎంఎల్ఆర్ఐటీలో జరగాల్సిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొననని తెలిపారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. అందరినీ మిస్సవుతున్నానని సమంత విచారం వ్యక్తం చేశారు.