ఆర్ కణ్ణన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ మరియు తెలుగు నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన "ది గ్రేట్ ఇండియన్ కిచెన్" మూవీ ZEE5లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో డిజిటల్స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం యొక్క తెలుగు-డబ్బింగ్ వెర్షన్ జీ తెలుగు ఛానెల్‌లో ఏప్రిల్ 14, 2023న ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో యోగి బాబు, పోస్టర్ నందకుమార్, మేఖ రాజన్, కలైరాణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని RDC మీడియా బ్యానర్‌పై దుర్గారామ్ చౌదరి మరియు నీల్ చౌదరి నిర్మించారు. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ ఈ చిత్రానికి సంగీత అందించారు.