ప్రముఖ నటి మాళవిక అవినాష్ అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తెలిగ్గా తీసుకోవద్దని, పనాడోల్స్, నెప్రోసిమ్ లాంటి మందులతో పాటు సంప్రదాయ ఔషధాలను వాడాలని సూచించారు. తలనొప్పే అని వదిలేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని, లేదంటే నాలా ఆసుపత్రిపాలు కావాల్సి ఉంటుంది అని తెలిపారు.