ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీపెళ్లి' త్వరలో థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈరోజు ఉదయం 11:11 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని నటుడు ప్రకటించారు. అయితే కొన్ని అనుకోని సమస్యల కారణంగా మూవీ మేకర్స్ టీజర్ విడుదలను వాయిదా వేశారు. త్వరలో మూవీ మేకర్స్ కొత్త తేదీని ప్రకటించనున్నారు.
జయసుధ, శరత్‌బాబు. వనితా విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రమ్, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.