రైటర్ పద్మభూషణ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి 'మేమ్ ఫేమస్' అనే ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ ని అయ్యయ్యో అనే టైటిల్ తో 14 ఏప్రిల్ 2023న సాయంత్రం 5.49 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సారయ మరియు సిరి రాసి ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.