మహానటి కీర్తి సురేశ్ ఫుల్ జోష్‌లో ఉంది. దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తదుపరి సినిమా షూటింగ్‌లకు రెడీ అవుతోంది. అయితే అంతకుముందే పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు. ప్రముఖ ఆభరణాల కంపెనీ ప్రమోషన్ యాడ్‌లో భాగంగా కీర్తి ఇలా కనిపించింది. ఈ ఫొటోల్లో ట్రెడిషినల్ లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.