గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత నటించిన 'శకుంతలం' సినిమా 2023 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 12.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
'శాకుంతలం' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::::::
నైజాం - 4.50 కోట్లు
సీడెడ్ - 1.20 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - 6.50 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.20 కోట్లు