మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 'మావీరన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తెలుగులో 'మహావీరుడు' గా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మావీరన్ యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకోగా, జెమినీ టీవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆగస్టు 11, 2023న విడుదల కానుంది.
ఈ చిత్రంలో అదితి శంకర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో సరిత, యోగి బాబు, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మించారు.