సుదీప్తో సేన్ దర్శకత్వంలో గ్లామర్ క్వీన్ అదా శర్మ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ది కేరళ స్టోరీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మే 5, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. అదా శర్మ విడుదల తేదీ పోస్టర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రంగా పేర్కొనబడిన ది కేరళ స్టోరీలో వెందు తానింధతు కాదు ఫేమ్ సిద్ధి ఇద్నాని, యోగితా బిహానీ, సోనియా బలానీ, విజయ్ కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.