ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IB71 : తెలుగు దర్శకుడి తొలి హిందీ చిత్రానికి విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2023, 08:44 PM

జాతీయ అవార్డు గ్రహీత, టాలీవుడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో తన తొలి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'IB71' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు విడుదల తేదీని లాక్ చేసుకుంది.


ఈ గూఢచర్య థ్రిల్లర్ మే 12, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి రావడానికి సిద్ధంగా ఉందని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.

ఈ దేశభక్తి స్పై థ్రిల్లర్‌లో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా, అశ్వత్ భట్, దలీప్ తాహిల్, డానీ సురా, సువ్రత్ జోషి మరియు దివాకర్ ధ్యాని తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. విద్యుత్ జమ్‌వాల్, అబ్బాస్ సయ్యద్, భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com