స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. గతంలో టాలీవుడ్ ను ఊపూపిన ఈ తమిళ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లోనే సందడి చేస్తోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం PS2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.కొన్నాళ్ల పాటు సైలెంట్ గా కేరీర్ ను సాగించిన త్రిష.. గతేడాది తమిళ బాహుబలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన Ponniyin Selvan పార్ట్ :1తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. నవల ఆధారంగా చోళసామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష ‘కుందవై’ పాత్రలో అలరించింది. నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దర్శనమిచ్చింది. ప్రమోషన్స్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ లుక్ లో త్రిష యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ముస్తాబైంది. రెడ్ అవుట్ ఫిట్ లో ట్రెండీగా మెరిసింది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. క్యూట్ స్మైల్ తో కుర్రభామలా కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. అలాగే త్రిష, ఐశ్వర్య రాయ్ ఓ ఫ్రేమ్ లో మెరిసిన బ్యూటీ ఫుల్ ఫొటోలో కూడా నెటిజన్లను ఆకట్టకుంటోంది.
Stunner is the word for #TrishaKrishnan @trishtrashers #Trisha #PonniyinSelvan2 #PS2FromApril28 #PS2Promotions #PS2 #jsolutions pic.twitter.com/WuAvj0blO1
— J SOLUTIONS MEDIA®️ (@jsolu_tions) April 26, 2023