తమిళ సంచలన దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతగా తన తొలి OTT ప్రాజెక్ట్ పెట్టైకాళి, జల్లికట్టు ఆధారంగా రూపొందించబడిన వెబ్ సిరీస్ ఆహా తమిళంలో ప్రదర్శించబడింది. తాజాగా ఆహా 8 ఎపిసోడ్‌ల సిరీస్‌ని తెలుగులో 'జల్లికట్టు' అనే టైటిల్ తో ఏప్రిల్ 28, 2023న నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కలైయరసన్, షీలా రాజ్ కుమార్, బాల హసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ ఈ సిరీస్ ని నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌కి లా రాజ్‌కుమార్ సంగీతం అందించారు.