కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
తాజా అప్డేట్ ప్రకారం, పబ్లిక్ డిమాండ్ కారణంగా USA ప్రాంతంలో ఈ చిత్రానికి అనేక కొత్త లొకేషన్లు మరియు స్క్రీన్‌లు జోడించబడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన 100 కోట్ల గ్రాస్‌ను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.