కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి(53) కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1997లో 'రాశి' సినిమాతో ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, తన కెరీర్లో అత్యధిక సినిమాలు అజిత్తోనే నిర్మించాడు. హీరో అజిత్ కుమార్తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.