బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2) సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు మే 19కి వాయిదా పడింది. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది.
థ్రిల్లింగ్ మరియు యాక్షన్ అంశాలతో ట్రైలర్ అభిమానులని చాలా ఆకట్టుకుంది. విజయ్ ఆంటోని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది. బిచ్చగాడు 2తో విజయ్ మరోసారి తన మార్క్ చూపించనున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. యాంటీ బిక్లి అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.
ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.