టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న జగపతి బాబు SSMB28లో తన పాత్ర పూర్తి రగ్గడ్ క్యారెక్టర్‌ని భయానకంగా మరియు స్పూకీ టచ్ కలిగి ఉంటుంది అని దాని గురించి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అని జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ మూవీ ఆగస్టు 11, 2023న విడుదల కానుంది. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీ లీల కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.