ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమాలో విద్వేష పూరిత ప్రసంగాలు, సన్నివేశాలు ఉన్నాయని, అందుకే విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను కోర్టు తోసి పుచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తయిందని, ఈ సమస్యను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది.