హీరో విక్రమ్ కు తీవ్రగాయాలయ్యాయి. తంగలాన్ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. విక్రమ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.