ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీచంద్ "రామబాణం" మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, May 05, 2023, 12:52 PM

యాక్ష‌న్ హీరో గోపీచంద్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటాడ‌న్న విష‌యం తెలిసిందే. అయితే అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లు మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆయ‌న స‌రైన హిట్స్ అందుకోలేకపోతున్నాడు. గ‌త కొంత కాలంగా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా సరే..పాపం కాలం కలిసిరాక చాలా సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి. ఇప్పుడు గోపిచంద్ భారీ అంచ‌నాల న‌డుమ రామ‌బాణం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. గ‌తంలో గోపిచంద్‌తో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రీవాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మరి ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా, క‌థ ఏంట‌నేది చూద్దాం.

క‌థ‌:
యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ అన్న -తమ్ముళ్ల అనుబంధంగా సాగింది. కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కధగా చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైనా కష్టాలని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? హీరోకి జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి స‌పోర్ట్ అందించాడు అనేది వెండితెర‌పై చూడాల్సిందే.

చిత్రంలో గోపిచంద్, జగపతి బాబు, .డింపుల్ హయాతి ,ఖుష్బు వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్ర‌లు పోషించారు. గోపిచంద్ త‌న పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. జగపతి బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. సినిమా అంతా కల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించింది.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే.. దర్శకుడు శ్రీవాస్ సినిమాలో యాక్షన్ , కామెడీని సరైన నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నించాడు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా సినిమా చూసుకోవడం ప్లస్ అయింది . మిక్కీ జె మేయర్ బీజీఎమ్ యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది .పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి .వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ నాణ్యమైన విజువల్స్ అంద‌రికి న‌చ్చాయి. భూపతి రాజా కథ కాస్త పాతదిగా ఉండటం సినిమాకి కాస్త మైన‌స్. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్:
న‌టీన‌టులు
యాక్ష‌న్, కామెడీ
బీజీఎం

మైన‌స్ పాయింట్స్:
క‌థ‌
స్లో న‌రేష‌న్

గోపిచంద్ సీనిమాలంటే యాక్షన్ సీన్స్, టాప్ డైలాగ్స్, ఎలివేషన్ లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే ఇది ఫ్యామిలీ డ్రామా అనే స‌రికి అవేమి ఉండ‌వ‌ని అనుకుంటారు. కాని శ్రీవాస్ అన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి సినిమాని గిఫ్ట్‌గా ఇచ్చాడు.విజువల్స్ ఉన్నతంగా తీర్చిదిద్దడం సినిమాకు కలసి వచ్చింది. గోపీచంద్ లుక్స్ పరంగా హీరోయిజం ఎలివేషన్స్ పరంగా మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాలో జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారు. అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి . డింపుల్ తో రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com