NS పొన్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తీక్ నటించిన 'ఆగష్టు 16, 1947' చిత్రం ఏప్రిల్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ వద్ద ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలైన ఒక నెల తర్వాత తమిళ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ పీరియాడికల్ డ్రామాలో రేవతి, రిచర్డ్ ఆష్టన్, రాబర్ట్, పుగాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్‌తో పాటు ఓం ప్రకాష్ భట్ మరియు నర్సిరామ్ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.