బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను మే 9, 2023న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రభాస్ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ భారతదేశంలోనే కాకుండా USA, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, మయన్మార్, శ్రీలంక, జపాన్, ఆఫ్రికా, UK, యూరప్, రష్యా, ఈజిప్ట్ మరియు ఫిలిప్పీన్స్‌తో సహా ఆసియా మరియు దక్షిణాసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో విడుదల కానుంది.
సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 16 జూన్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.