ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డితో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అన్నీ మంచి శకునములే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్‌కి లేడీ లవ్ గా మాళవిక నాయర్ నటించారు. ఈ చిత్రం 18 మే 2023న విడుదల కానుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా నుంచి నాలుగోవ సింగిల్‌ని విడుదల చేశారు. చెయ్యి చెయ్యి కలిపేద్దాం అనే టైటిల్‌తో విడుదలైన ఈ మ్యారేజ్ సాంగ్ ని మిక్కీ జె మేయర్ స్వరపరచగా, శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సాందీప్ మరియు చైత్ర అంబడిపూడి స్వరాలు అందించారు. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సౌకార్ జానకి, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, వాసుకి, రమ్య సుబ్రమణియన్, మరియు అంజు అల్వికా నాయక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా మరియు మిత్ర వింద మూవీస్ పతాకంపై ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత అందిస్తున్నారు.