మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ మరియు వడివేలు ప్రధాన పాత్రల్లో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి 'మామన్నన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సంగీత దర్శకుడు AR రెహమాన్ ఇటీవల ఒక పాటను రికార్డ్ చేయగా ఈ పాటని వడివేలు గారు పడినట్లు సమాచారం. పాటల రికార్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ట్రాక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్ యొక్క M షెంగాబాగ్ మూర్తి మరియు R అర్జున్ దురై నిర్మించారు.