‘ది కేరళ స్టోరీ’ స్టోరీ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తమిళ్/మలయాళీ అమ్మాయి హీరోయిన్.. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఓ హిందీ సినిమా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే’ అంటూ తాజాగా ట్వీట్ చేశారు. వివాదాల మధ్య మే 5న విడుదలైన ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ తాజా ట్వీట్ ఆసక్తి రేపుతోంది.
![]() |
![]() |