వేణు దర్శకుడిగా తీసిన ‘బలగం’ సినిమాకు అవార్డుల పంటపండుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శికి ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ప్రియదర్శి స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ఆయనతో పాటు సినిమాలో తాతగా నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అవార్డు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.