అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'కింగ్ ఆఫ్ కోత' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్‌ని సోనీ మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఓనం సందర్భంగా అంటే ఆగస్టు నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షబీర్ కల్లరక్కల్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa