టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఇటీవలే మూవీ టీమ్ ఈ సినిమా యొక్క భారీ షెడ్యూల్‌ను ముగించుకున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ మే 17, 2023 న ప్రారంభమవుతుంది అని లేటెస్ట్ టాక్.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.