టాలీవుడ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన జూన్ 3న రాజస్థాన్లోని జైపుర్లో వివాహం చేసుకోనున్నారు. అక్కడి లీలా ప్యాలెస్ వేదికగా తన ప్రేయసి రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలో శర్వానంద్, రక్షితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
శర్వానంద్, రక్షిత వివాహం జూన్ 3 రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు భారీ ఎత్తున పాల్గొననుండగా, మెగా ఫ్యామిలీ హీరోలు చాలా మంది ఈ పెళ్లికి హాజరుకానున్నారు. జైపూర్ లో జరగనున్న వివాహ వేడుకలో రామ్ చరణ్ తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, హీరోయిన్లు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రక్షితారెడ్డి ప్రముఖ టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు.