తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ మిగతా తెలుగు హీరోయిన్స్ కన్నా కొద్దిగా బెటర్ అనిపించినా ఈమధ్య అమ్మడికి సరైన అవకాశాలు లేక కెరీర్ లో వెనకపడ్డది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు అప్పటినుంచి కెరీర్ పరంగా గ్రాఫ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవలేదు.
యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈషా రెబ్బ స్టార్ ఛాన్స్ లు మాత్రం అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ గా అమ్మడికి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయని తెలుస్తుంది. ఇక తన మీద అటెన్షన్ తెచ్చుకునేందుకు ఈషా రెబ్బ ఫోటో షూట్స్ చేస్తున్నా అవి కూడా పెద్దగా యూజ్ అవట్లేదు. అయితే ఇప్పటికీ మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపిస్తా అంటుంది ఈషా రెబ్బ. మరి ఈ తెలుగు అమ్మాయిని పట్టించుకోవడంలో దర్శక నిర్మాతలు ఎందుకు ముందుకు రావట్లేదో తెలియాల్సి ఉంది. ఈషా మాత్రం సినిమాలు చేసినా చేయకపోయినా ఫోటో షూట్స్ తో కాలం వెల్లదీస్తుంది. ఇక మీదట గ్లామర్ షోకి తాను రెడీ అని చెప్పకనే చెబుతుంది ఈషా రెబ్బ. ఒక్క ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి రెచ్చిపోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది అమ్మడు.