తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 2023 జూలైలో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జైలర్ నిర్మాతలు గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమాలోని ఫస్ట్ ట్రాక్ విడుదలయ్యే అవకాశం ఉంది అని లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.
ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.