బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తో ఆదిపురుషపై ఉన్న నెగిటివిటీ పూర్తిగా తొలగిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్న జై శ్రీ రామ్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు మే 20న మూవీ మేకర్స్ పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం.
సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 16 జూన్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.