యంగ్ హీరోయిన్ కృతి శెట్టి బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీలో ట్రెడిషనల్ గా దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. లేటెస్ట్ పిక్స్ అదిరిపోయేలా ఉన్నాయి.‘ఉప్పెన’తో హీరోయిన్ కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పంజావైష్ణవ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. తన పాత్రకు న్యాయం చేసి ‘బేబమ్మ’గా క్రేజ్ సాధించుకుంది.ఇండస్ట్రీలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో కృతి శెట్టికి వరుసగా మూడు చిత్రాలు సక్సెస్ అందించాయి. దీంతో హ్యాట్రిక్ బ్యూటీగానూ ముద్ర వేసుకుంది. ఇక నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’లో బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ మతులు పోగొట్టింది. దాంతో మరిన్ని ఆఫర్లను అందుకుంది.ఇదేసమయంలో కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో నయా లుక్ తో మైమరిపిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోయింది.