టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా యొక్క రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మరియు ఇతరుల మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
![]() |
![]() |