పుష్ప: ది రైజ్ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన మాస్ హిస్టీరియా గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ఇప్పుడు దేశం మొత్తం పుష్ప: ది రూల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది.
ఇప్పటికే వైజాగ్, కేరళలో కీలక షెడ్యూల్స్‌ను ఈ చిత్రం పూర్తి చేసుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, పుష్ప 2 యొక్క తాజా షెడ్యూల్ మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతంలో ముగిసినట్లు సమాచారం. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించిన మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, ఇటీవల ముగిసిన షెడ్యూల్‌లో అనేక ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేసినట్లు సినిమా సెట్‌లో ఫహద్ మరియు సుకుమార్ ఇద్దరూ కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ ని మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.
ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, జగదీష్ ప్రతాప్, ధనంజయ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.