సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీకి అధికారికంగా 'BRO' అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ధృవీకరించబడింది.
ఈ బిగ్గీ జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.