బాలీవుడ్ బ్యూటీ నటి నేహా ధూపియా మనందరికీ సుపరిచితమే. తరచూ బాలీవుడ్ ని ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా 2002 లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న తెలిసిందే. ఆ తరువాత నెమ్మదిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కాగా తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది నేహా ధూపియా. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. ఆపై తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది.
గతేడాది ఏ థర్స్డే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరై తన తన పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని 2018 మే లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే ఒక బిడ్డకు కూడా జన్మినిచ్చారు. దీంతో తమపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదని ఆమె తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందే తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది నేహా. గర్భం ధరించిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో పెళ్లికి కేవలం 72 గంటల సమయమే ఇచ్చారని నేహా తెలిపింది. దీంతో ముంబయిలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే ప్రెగ్నెన్నీ విషయం బయటకు చెప్పేందుకు తాము చాలా ఉద్వేగానికి లోనయ్యామని వివరించింది. 2018లో ఒక్కటైన ఈ జంటకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.