అల్లు అరవింద్ సమక్షంలో ఆహా ఓటీటీ సరికొత్త ప్లానింగ్ తో దూసుకెళ్తుంది. పోటీగా అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ ఎన్ని ఒరిజినల్ సీరీస్ లతో వస్తున్నా ఆహా కూడా తెలుగు ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తూ వస్తుంది.
ఇక ఆహా లో ప్రెస్టిజియస్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా సీజన్ 2 కూడా ఈమధ్యనే మొదలైంది. ఇండియన్ ఐడల్ సీజన్ 2 కూడా శ్రోతలను అలరిస్తుంది. దాదాపు 20 మందితో మొదలైన ఈ సెకండ్ సీజన్ ఇప్పుడు ఫైనల్స్ కు చేరింది. ఆహా ఇండియన్ ఐడెల్ సీజన్ 2కి ఫైనల్స్ కు ఐదుగురు సింగర్స్ చేరుకున్నారు. నెక్స్ట్ వీక్ ఈ ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ తర్వాత టైటిల్ విజేతని అనౌన్స్ చేయనున్నారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆహా లో రాబోతున్న ఈ ఎపిసోడ్ మరోసారి క్రేజీగా మారబోతుందని చెప్పొచ్చు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.