'గుప్పెడంత మనసు' సీరియల్ గురించి తెలియని యువత ఉండరు. ఈ సీరియల్ లో రిషి-వాసు జంట చాలా బాగుంటుంది. తాజాగా ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే చికిత్స పొందుతున్న ముఖేష్ తండ్రి మృతి చెందాడు. ముఖేష్ తన తండ్రిని కోల్పోయాడు. తన తండ్రి మరణ వార్త విన్న ముఖేష్ గౌడ్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. ముఖేష్ గౌడ కన్నడ నటుడు. 'గుప్పెడంత మనసు' సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు.