గ్లోబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ని జూన్ 6న తిరుపతిలో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక దీనిని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.