టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 మే 2023న 4కె వెర్షన్‌లో రీలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.30 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు. ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
'సింహాద్రి' 4K రీ రిలీజ్ కలెక్షన్స్ :::::
నైజాం : 1.15 కోట్లు
సీడెడ్ : 92 L
UA: 31 L
ఈస్ట్ : 18 L
వెస్ట్ : 14 L
గుంటూరు : 23 L
కృష్ణ : 24 L
నెల్లూరు : 13 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.30 కోట్ల గ్రాస్