ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావీరన్ : తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసిన శివకార్తికేయన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 06:57 PM

మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ 'మావీరన్‌' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తెలుగులో మహావీరుడుగా విడుదల కానుంది. ఈ చిత్రం జూలై 14, 2023న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఇటీవల తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన శివకార్తికేయన్ ఆ పనిని పూర్తి చేసినట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ చిత్రంలో అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో సరిత, యోగి బాబు, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com