నటి డింపుల్ హయతి హైకోర్టును ఆశ్రయించారు. తన పై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆమె పిటిషన్ వేశారు. ఇటీవల అపార్ట్ మెంట్ పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి మధ్య వివాదం నెలకొంది. దీంతో డింపుల్ పై రాహుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పిటిషనర్లపై అసత్య అభియోగాలు నమోదు చేశారని, పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ట్రాఫిక్ డీసీపీ ప్రోద్బలంతోనే ఆయన కారు డ్రైవర్ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఏపీపీ గణేశ్ వాదిస్తూ, నటి డిపుల్ హయతికి పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారని చెప్పారు. కారును ధ్వంసం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాదనల అనంతరం న్యాయమూర్తి పైఆదేశాలు జారీ చేశారు.