మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. పీకల్లోతూల్లో ప్రేమలో మునిగిన ఈ జంట పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?. అసలు వీళ్ల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైందనే విషయం చాలా మందికి తెలియదు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాలో వరణ్-లావణ్య మొదటిసారిగా కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం 2016లో ఇటలీ వెళ్లారట. అక్కడే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. స్నేహితులుగా పరిచయమై.. ప్రేమికులయ్యారు. త్వరలో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నారు.